జబర్దస్త్ అవినాష్‌కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్నింగ్..

జబర్దస్త్ ఫేమ్ అవినాష్‌కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ..సుకుమార్ డైరెక్షన్లో పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 01 భారీ విజయం సాధించడం తో అంతకు మించి అన్నట్లు పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా విడుదలైన ట్రైలర్ , పోస్టర్ సినిమా ఫై అమాంతం అంచనాలు రెట్టింపు చేసింది. ముఖ్యంగా అమ్మవారి గెటప్ లో ఉన్న అల్లు అర్జున్ పోస్టర్ వైరల్ గా మారింది.

చీర, జాకెట్ ధరించి.. మెడలో నిమ్మకాయల దండ వేసుకుని.. నుదుటు పెద్ద బొట్టూ.. కనుబొమ్మల చుట్టూ తెల్లటి బొట్లు.. ఒంటి నిండా నగలు.. చేతికి గాజులతో గంగమ్మ తల్లి గెటప్‌లో దర్శనం ఇచ్చారు అల్లు అర్జున్. పోస్టర్ రిలీజ్ కాగానే పాన్ ఇండియా రేంజ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

ఈ నేపథ్యంలో జబర్దస్త్ ఫేమ్ అవినాష్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవినాష్.. ‘పుష్ప 2’ లుక్‌ని ఇమిటేట్ చేస్తూ.. అరకొర ఎడిటింగ్‌తో అతను కూడా ‘పుష్పరాజ్’లా మారిపోయాడు. సేమ్ అల్లు అర్జున్ మాదిరిగా.. నుదుటున బొట్టు, కనుబొమ్మల చుట్టూ తెల్లటి బొట్లు, ముక్కుపుడక, చెవి దిద్దులతో ఉగ్రంగా మారి ఆ ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ ఓన్ మేడ్ పోస్టర్‌తో అల్లు అర్జున్‌కి బర్త్ డే విషెష్ చెప్పారు అవినాష్. ఈ పోస్టర్ ను చూసిన అల్లు అర్జున్ వెంటనే ఈ పోస్టర్ తీయాలంటూ హెచ్చరించడం మొదలుపెట్టారు.