ఏపీలోని కొత్త జిల్లాలకు ఎల్‌జీడీ కోడ్‌లు

ఇకపై కొత్త కోడ్‌ల ఆధారంగానే పాలనాపరమైన వ్యవహారాలు

అమరావతి: ఏపీలోని కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్‌జీడీ) కోడ్‌లు కేటాయించింది. పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అనకాపల్లికి 744, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 745, కాకినాడకు 746, కోనసీమకు 747, ఏలూరుకు 748, ఎన్టీఆర్ జిల్లాకు 749, బాపట్లకు 750, పల్నాడుకు 751, తిరుపతికి 752, అన్నమయ్య జిల్లాకు 753, శ్రీ సత్యసాయి జిల్లాకు 754, నంద్యాలకు 755 కోడ్‌లను కేటాయించింది.

ఇకపై ఈ కోడ్‌ల ఆధారంగానే పాలనాపరమైన వ్యవహారాలు నడుస్తాయి. ముఖ్యంగా పంచాయత్ ఈ-పంచాయత్ మిషన్ మోడ్ కింద ఎంటర్‌ప్రైజ్ సూటీ (పీఈఎస్) పేరుతో రూపొందించే అప్లికేషన్లలో వీటిని వినియోగిస్తారు. అలాగే, వివిధ రాష్ట్రాలతో కేంద్రం జరిపే పాలనాపరమైన సంప్రదింపులు, వివిధ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు తదితర అంశాల్లోనూ వీటిని వినియోగిస్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/