పాక్‌ కాల్పుల్లో భారత ఆర్మీ జవాన్‌ మృతి

అప్రమత్తమైన భారత సైనికులు దీటుగా బదులు

Indian-Army-jawans

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ సరిహద్దుల్లో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా, కృష్ణ ఘాటి సెక్టార్లలో నియంత్రణ రేఖ వద్ద పాక్‌ బలగాలు సోమవారం ఉదయం కాల్పులకు తెగబడ్డాయి. పాక్‌ కాల్పుల్లో రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో భారత జవాన్‌ ఒకరు మృతి చెందారు. పాక్‌ కాల్పులతో అప్రమత్తమైన భారత సైనికులు దీటుగా బదులిచ్చారు. భారత్‌, పాక్‌ బలగాల మధ్య రెండు గంటలపాటు కాల్పులు జరిగాయి. సరిహద్దుల వెంట తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్‌ తరచూ తూట్లు పొడుతుస్తున్నది. గత 15 రోజుల్లోనే నాలుగుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాని ఉల్లంఘించింది. మొత్తంగా ఈ నెలలో పాకిస్థాన్‌ బలగాల కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు మృతిచెందారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/