కమలా హారిస్‌పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

క‌మ‌లా హారిస్‌కు అర్హ‌త లేదు..ట్రంప్‌

కమలా హారిస్‌పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు
kamala-harris-trump

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా భార‌తీయ సంత‌తిరాలు క‌మ‌లా హారిస్ పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే కమలా హారిస్‌పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హారిస్‌కు అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా పోటీ చేసే అర్హ‌త లేద‌ని అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. వ‌ల‌స‌వ‌చ్చిన వారికి క‌మ‌లా హారిస్ జ‌న్మించింద‌ని, అమెరికా రాజ్యాంగం ప్ర‌కారం ఆమెకు ఉపాధ్య‌క్షురాలిగా పోటీ చేసే అర్హ‌త లేద‌ని ఇటీవ‌ల ఓ మేటి క‌న్జ‌ర్వేటివ్ న్యాయ‌వాది పేర్కొన్నారు. దీంతో క‌మ‌లా హారిస్ జ‌ననంపై వివాదాం నెల‌కొన్న‌ది. భార‌త్‌కు చెందిన త‌ల్లి, జ‌మైకాకు చెందిన తండ్రికి క‌మ‌లా హారిస్ 1964 అక్టోబ‌ర్ 20న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జ‌న్మించింది.

డెమోక్ర‌టిక్ అధ్య‌క్ష అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్ త‌న డిప్యూటీగా క‌మ‌లా హారిస్‌ను ఎంపిక చేశారు. అయితే క‌మ‌లా జ‌న‌నంపై వివాదాం నెల‌కొన్న నేప‌థ్యంలో వైట్‌హౌజ్‌లో ఈ అంశంపై ట్రంప్ మాట్లాడారు. ఉపాధ్య‌క్షురాలిగా అయ్యే అర్హ‌త క‌మ‌లాకు లేద‌ని, ఆమె అర్హ‌త గురించి క‌న్జ‌ర్వేటివ్ న్యాయ‌వాది ప్ర‌శ్నించార‌ని ట్రంప్ తెలిపారు. ఆమెను ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిగా ఎంపిక చేసే ముందు డెమోక్రాట్లు ఒక‌సారి చెక్ చేసుకుంటే బాగుండేద‌న్నారు. క‌మ‌లాకు పోటీ చేసే అర్హ‌త లేద‌న్న సీరియ‌స్ అంశ‌మ‌ని, అంద‌రూ అదే చెబుతున్నార‌ని, ఆమె ఈ దేశంలో పుట్ట‌లేదు కాబ‌ట్టి ఆమెకు అర్హ‌త లేద‌ని ట్రంప్ తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/