స్పెషల్ క్లాస్ అని చెప్పి..17 మంది బాలికల ఫై ప్రిన్సిప‌ల్ లైంగిక దాడి

స్పెషల్ క్లాస్ అని చెప్పి..17 మంది బాలికల ఫై ప్రిన్సిప‌ల్ లైంగిక దాడి

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రధానోపాధ్యాయుడే నీచమైన పని చేసి సమాజంలో తలెత్తుకోకుండా అయ్యాడు. స్పెషల్ క్లాస్ అని చెప్పి 17 మంది బాలికల ఫై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ లో 10 వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న 17 మంది బాలిక‌ల‌ను ప‌రీక్ష‌ల పేరుతో పాఠ‌శాలకు పిలిచినా ప్రధానోపాధ్యాయుడు.. మ‌రుస‌టి రోజు సీబీఎస్ఈ ప్రాక్టిక‌ల్స్ ఉన్నాయ‌ని.. రాత్రి అంతా ఇక్క‌డే ఉండి చ‌దువు కోవాల‌ని సూచించాడు. ప్రధానోపాధ్యాయుడు చెప్పడం తో తల్లిదండ్రులు కూడా నిజమే అనుకోని వారిని పంపించారు. బాలికలకు భోజ‌నం ఏర్పాటు చేసిన ప్రధానోపాధ్యాయుడు.. అందులో మ‌త్తు మందు క‌లిపాడు. వారు సృహా త‌ప్పిన త‌ర్వాత 17 మంది బాలిక‌ల పై ప్రధానోపాధ్యాయుడు తో పాటు మ‌రొక వ్య‌క్తి లైంగిక దాడి కి పాల్ప‌డ్డాడు. అయితే ఈ విష‌యం బ‌య‌ట‌కు చెబితే.. ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ చేస్తామ‌ని బెదిరించారు. బాలిక‌లు మాత్రం ఏమాత్రం భయపడకుండా జరిగిన విషయాన్నీ త‌మ క‌టుంబ స‌భ్య‌లకు చెప్పారు. వారు పోలీసులు ఫీర్యాదు చేసినా.. ప‌ట్టించు కోలేక పోవ‌డంతో స్థానిక ఎమ్మెల్యే ప్ర‌మోద్ ఉత్వాల్ ను ఆశ్ర‌యించాగా.. ఈ విష‌యం వెలుగు లోకి వ‌చ్చింది. ఎమ్మెల్యే ఆదేశాల‌తో పోలీసులు ద‌ర్యాప్తు చేయ‌గా.. నిజం బ‌య‌ట ప‌డింది. దీంతో వారి పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.