అల్లరి నరేష్ ‘ఉగ్రం’ టీజర్ రిలీజ్

అల్లరి నరేష్ కొత్త చిత్రం ఉగ్రం తాలూకా టీజర్ ను మేకర్స్ బుధువారం విడుదల చేసారు. గత కొంతకాలంగా సరైన హిట్స్ లేని అల్లరి నరేష్ కు నాంది చిత్రం సూపర్ హిట్ అయ్యి..నరేష్ సినీ కెరియర్ కు ఊపిరి పోసిన సంగతి తెలిసిందే. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల డైరెక్షన్లో గత ఏడాది ఫిబ్రవరి లో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించి..నరేష్ లోని మరో కోణాన్ని బయటపెట్టింది. ఈ సినిమా హిట్ తర్వాత దీనికి సీక్వెల్ గా ఓ సినిమా రాబోతుందని ప్రకటించారు. ఇప్పుడు దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు.

విజ‌య్ క‌న‌క‌మేడ‌ల డైరెక్షన్లో నరేష్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ఉగ్రం. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్నఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. ఈ మూవీ తో ‘మిర్నా’ అనే హీరోయిన్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా తాలూకా టీజర్ ను నాగచైతన్య విడుదల చేశారు. నరేశ్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్ధమవుతుంది. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

YouTube video