రిలయెన్స్‌ తో కలిసి అన్నపూర్ణ చిత్రనిర్మాణం

ANNAPURNA STUDIOS NEW FILM

భారత క్రికెట్‌ చరిత్రలో 1983 ఏడాదిని సువర్ణాక్షరాలతో లిఖించాల్సిందే.. ఆ ఏడాది కపిల్‌దేవ్‌ సారధ్యంలో భారత క్రికెట్‌ జట్టు విశ్వవిజేతగా ఆవిర్భవించింది.. ఈ అసాధారణ ప్రయాణాన్ని వెండితెరపై ’83 సినిమాగా ఆవిష్కరిస్తున్నారు డైరెక్టర్‌ కబీర్‌ఖాన్‌.. అన్నపూర్ణ స్టూడియోస్‌, రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ సమర్పణలో కబీర్‌ఖాన్‌ ఫిలిమ్స్‌ నిర్మాణంలో దీపికా పడుకొనె, సాజిద్‌ నడియద్‌వాలా, కబీర్‌ఖాన్‌, నిఖిల్‌ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్‌ లిమిటెడ్‌, ఫాంటమ్‌ ఫిలింస్‌ ఈ బిగ్గెస్ట్‌ స్పోర్ట్స్‌ డ్రామాను నిర్మిస్తున్నాయి..

83 చిత్రాన్ని ఏప్రిల్‌ 10న తెలుగు, తమిళ , హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్‌, రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు తెలుగులో 83 చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి.ఈసందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, క్రికెట్‌ జగుత్తలో 1983లో మన దేశం గొప్ప విజయాన్ని సాధించిందని, ఈ విజయంతో మన దేశంలో క్రికెట్‌ ఓ మతం అనేంత గొప్పగా మమేకమైందన్నారు. ఈ ప్రయాణం గురించి చెప్పే చిత్రమే 83 అన్నారు. ఈ జర్నీ గురించి తెలుసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు.. కార్యక్రమంలో దర్శకుడు కబీర్‌ఖాన్‌, రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిఇఒ షిభాసిన్‌ సర్కార్‌ తదితరులు మాట్లాడారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/