మరో రూ.8వేల కోట్లు చెల్లించిన భారతీ ఎయిర్‌టెల్
అర్థంతరంగా ముగిసిన టెలికం రంగాల భేటీ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆగ్రహంతో బకాయిల చెల్లింపులను వేగవంతం చేస్తున్నాయి టెలికాం సంస్థలు. ఇప్పటికే రూ.10 వేల కోట్లు చేల్లించిన ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ నేడు మరో రూ. 8004 కోట్లను కట్టింది. ఇదిలా ఉండగా.. ఎజిఆర్ బకాయిలు రద్దు చేయాలని, పలు ప్రోత్సాహాకాలు ఇవ్వాలని టెలికం కంపెనీల చేస్తున్న డిమాండ్‌లపై భేటీ అయినా డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డిసిసి) కీలక సమావేశం అర్ధంతరంగా ముగిసింది. రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో టెలికాం కంపెనీల ఎజిఆర్ బకాయిలకు సంబంధించి ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. ఇందుకు మరికొంత ఎజిఆర్ డేటా అవసరమని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/