పండంటి పాపకు జన్మనిచ్చిన ఆలియా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పండింటి పాపకు జన్మనిచ్చారు. ఆదివారం ఉదయం భర్త రణబీర్ కపూర్‏తో కలిసి ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఆలియా.. మధ్యాహ్నం సమయంలో ఆడపిల్లకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని కపూర్ కుటుంబసభ్యులు తెలిపారు.

ఈ గుడ్ న్యూస్‌తో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంతోషంగా ఉన్నారు. నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా రణ్ భీర్, ఆలియా దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించి, ఇరు కుటుంబాలను ఒప్పించి ఏప్రిల్ 14న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులు పెళ్లి చేసుకున్న రెండు నెలలకే ఆలియా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించారు. ఆదివారం ఆలియా భట్ గిర్‌గాన్‌ లోని అంబానీకి చెందిన రిలయన్స్ హాస్పిటల్‌ లో పాపకు జన్మనిచ్చింది.