అలా మొదలైంది..మళ్లీ రాబోతుంది

ఈ మధ్య టాలీవుడ్ లో ఓ ట్రెండ్ నడుస్తుంది. గతంలో సూపర్ హిట్ అయినా చిత్రాలను రీ రిలీజ్ చేసి అభిమానులను సంతోష పరుస్తున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి , వెంకటేష్ , మహేష్ బాబు ఇలా పలువురి సినిమాలు రీ రిలీజ్ అయ్యి అలరించగా..ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా సందడి చేయబోతున్నాడు.

నాని – నందిని రెడ్డి – నిత్యా మీనన్ కలయికలో వచ్చిన అలా మొదలైంది చిత్రం నాని పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 24 న రీ రిలీజ్ కాబోతుంది.నందినీ రెడ్డి దర్శకత్వంలో 2011లో విడుదలైన ఈ చిత్రంలో నాని, నిత్య మేనన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా నందినీ రెడ్డికి పరిచయం అవ్వగా , నిత్యా మీనన్ సైతం హీరోయిన్ తెలుగు తెరకు పరిచమైంది. ఈ సినిమాను కె. ఎల్. దామోదర ప్రసాద్ శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై నిర్మించాడు. వివేక్ కూచిభొట్ల ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. కల్యాణి మాలిక్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించగా , మార్తాండ్. కె. వెంకటేష్ కూర్పు బాధ్యతవహించారు. ఈ మూవీ థియేటర్స్ లోనే కాదు బుల్లితెర ఫై కూడా సూపర్ హిట్ అయ్యింది. మరి ఇప్పుడు రీ రిలీజ్ ఎలా సందడి చేస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం నాని దసరా మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.