ఉత్త‌రాఫ్రికా ఆల్‌ఖ‌యిదా చీఫ్‌ హతం

వెల్లడించిన ఫ్రాన్స్‌

ఉత్త‌రాఫ్రికా ఆల్‌ఖ‌యిదా చీఫ్‌ హతం
Al-Qaeda chief in north Africa Abdelmalek Droukdel

ఫ్రాన్స్‌: మాలే దేశంలో జ‌రిగిన ఆప‌రేష‌న్‌లో ఉత్త‌ర ఆఫ్రికాకు చెందిన ఆల్ ఖ‌యిదా నేత అబ్దెల్‌మాలిక్ డ్రౌక‌డెల్‌ను హ‌త‌మార్చిన‌ట్లు ఫ్రాన్స్ ప్ర‌క‌టించింది. డ్రౌక‌డెల్‌తో పాటు అత‌ని స‌భ్యులు కొంద‌రు హ‌త‌మైన‌ట్లు ఫ్రాన్స్ ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే తెలిపారు. మే నెల‌లో మాలేలోనే జ‌రిగిన మ‌రో ఆప‌రేష‌న్‌లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపు క‌మాండ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫ్రాన్స్ చేప‌డుతున్న డేరింగ్ ఆప‌రేష‌న్స్‌తో ఉగ్ర‌వాద గ్రూపుల‌కు భారీ జ‌ల‌క్ త‌గిలిన‌ట్లు భావిస్తున్నారు. భాగ‌స్వామ్య బృందాల‌తో ఉగ్ర‌వాద వేట‌ను కొన‌సాగించ‌నున్న‌ట్లు ఫ్రాన్స్ ప్ర‌క‌టించింది. 40 ఏళ్లు దాటిన అబ్దెల్‌మాలిక్‌.. గ‌తంలో ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉన్న సోవియేట్ ద‌ళాల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేశాడు. ఇరాక్‌లోనూ ఆల్‌ఖ‌యిదా నేత‌గా కొన‌సాగాడు. మాలే, బుర్కినోఫాసోలో జ‌రిగిన ప‌లు ఉగ్ర‌వాద దాడుల‌కు ఇత‌నే కార‌ణం. ఓ మ‌ర్డ‌ర్ కేసులో అబ్దెల్‌కు 2012లో అల్జీరియా కోర్టు ఉర‌శిక్ష‌ను ఖ‌రారు చేసింది. 2007లో అత‌నూ అల్జీర్స్‌లో బాంబు పేలుళ్ల‌ల‌కు పాల్ప‌డ్డాడు. ద‌శాబ్ధ కాలం నుంచి అబ్దెల్‌ను ప‌ట్టుకునేందుకు ఫ్రాన్స్ భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/