కరోనా బారినపడిన పవన్ కొడుకు , మాజీ భార్య

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తోంది. వందలు , వేలు దాటి ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదుపై వుతుండడం తో సామాన్య ప్రజలే కాక ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సినీ ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు , బండ్ల గణేష్ , థమన్ , మంచు లక్ష్మి , రాజేంద్ర ప్రసాద్ , సత్యరాజ్ వంటి వారు కరోనా తో బాధపడుతుండగా…తాజాగా పవన్ ఫ్యామిలీ లో కూడా కరోనా కలకలం రేపింది.

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తో పాటు ఆయన కొడుకు అకిరా లు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా రేణు దేశాయ్ తెలిపింది. `అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే వున్నప్పటికీ నేను అకీరా కరోనా బారిన పడ్డాం. కొన్ని రోజుల క్రితం లక్షణాలు కనిపించగా పరీక్షలు చేయిస్తే కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం మేం కోలుకుంటున్నాం. నేఉ ఇది వరకే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను.

అయినా నాకు కరోనా సోకింది. అకీరాకు వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో అతనికి కోవిడ్ సోకింది. ఈ థర్డ్ వేవ్ ను చాలా తేలిగ్గా తీసుకోకండి.. సీరియస్ గా తీసుకోండి. మాస్కులు ధరించండి.. జాగ్రత్తలు పాటించండి.. జాగ్రత్తగా వుండండి` అంటూ రేణు దేశాయ్ ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. ఈ విషయం తెలిసిన దీంతో పవన్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా వారు కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.