రాహుల్ సిరిసిల్ల పర్యటన రద్దు..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సిరిసిల్ల పర్యటన రద్దయ్యింది. రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు, సోనియా గాంధీ ని ఈడీ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో రాహుల్ సిరిసిల్ల పర్యటన ను రద్దు చేసుకున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తాం అని స్పష్టం చేసింది.

ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన దూకుడును పెంచింది. మొన్నటి వరకు ఇంటికే పరిమితమైన నేతలంతా మళ్లీ కొత్త ఉత్సహంతో పరుగులుపెడుతున్నారు. వరుస పెట్టి ధర్నాలు , సమావేశాలు , ప్రజా సమస్యల ఫై పోరాటాలు చేస్తూ ప్రజలకు దగ్గర అవుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ లోకి చేరికలు కూడా భారీగానే జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ టికెట్ దక్కని వారంతా కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నట్లు తెలుస్తుంది. గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి కొత్త కళ రావడం..ప్రజల్లో కూడా కాస్త నమ్మకం పెరుగుతుండడం తో అధికార పార్టీ నేతలు , కార్యకర్తలు , పలు కియాశీలక వ్యక్తులు సైతం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దపడుతున్నారు. ఇక ఎన్నికలకు ఇక సమయం ఉండడంతో వెయిట్ చేస్తున్నారు. ఎన్నికల సమయం నాటికీ చేరికలు భారీగా ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు.

సోనియా ఈడీ విచారణ కు వస్తే..ఇప్పటికే రెండు సార్లు విచారణ జరుగగా..ఈరోజు మూడోసారి ఈడీ ముందుకు సోనియా వచ్చారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా సోనియాగాంధీని మూడో రోజు ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఈ మేరకు పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద సోనియా గాంధీ స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీని విచారించి ఆయన స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు.