ట్రంప్ పోస్టును తొలగించిన ఫేస్‌బుక్‌

తప్పుడు సమాచారాన్ని షేర్ చేశారన్న ఫేస్‌బుక్

trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఓ పోస్ట్‌ను ఫేస్‌బుక్‌ తొలగించింది. ట్రంప్‌ ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. కొవిడ్‌19ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి చిన్నారుల్లో ఉంటుందని చెప్పారు. అయితే, తమ సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తూ, కరోనా వైరస్‌పై డొనాల్డ్ ట్రంప్ తప్పుడు సమాచారాన్ని షేర్ చేశారని ఫేస్‌బుక్‌ పేర్కొంది. అయితే, ఇది క‌రోనా వైర‌స్ ప‌ట్ల జరుగుతోన్న త‌ప్పుడు ప్ర‌చారమని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఇది తమ పాలసీలను ఉల్లంఘించడమే అవుతుందని, కొవిడ్‌19 గురించి ఇచ్చిన ఈ సమాచారం హానికరమని ఫేస్‌బుక్ వివరణ ఇచ్చింది. ఇందుకే ఈ పోస్టును తొలగించామని ఫేస్‌బుక్ సంస్థ వివరణ ఇచ్చింది. అయితే ఆ పోస్టును డిలీట్ చేసిన‌ట్లు ఫేస్‌బుక్ విధాన ప్ర‌తినిధి ఓ ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/