ఇరు దేశాల మద్య సహకారం కొత్త శిఖరాలకు చేరుకుందిః ప్రధాని మోడీ

‘Akhaura-Agartala rail link inauguration historic’: PM Modi, Bangladesh’s Sheikh Hasina jointly unveil 3 development projects

న్యూఢిల్లీః కొన్ని దశాబ్దాలుగా చేయలేని ఎన్నో పనులను భారత్-బంగ్లాదేశ్ లు గత తొమ్మిదేళ్లలో చేశాయని.. ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇరు దేశాల మద్య సహకారం కొత్త శిఖరాలకు చేరుకుందని తెలిపారు. భారత్ సహకారంతో బంగ్లాదేశ్ తో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ ఈరోజు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. భారత్-బంగ్లాదేశ్ మధ్య సహకారం విజయవంతం అయింది. కొన్ని దశాబ్దాలుగా చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను గత 9 ఏళ్లలో ఇరు దేశాలు కలిసి చేశాయి. ఇది చాలా సంతోషించదగ్గ విషయమన్నారు.

భారత్ సహాకారంతో బంగ్లాదేశ్ పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో అఖౌరా-అగర్తలా క్రాస్ బోర్డర్ రైలు లింక్, ఖుల్నా-మొంగ్లా పోర్టు రైలు లైన్, మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అఖౌరా-అగర్తలా క్రాస్ బోర్డర్ రైలు లింక్ ప్రాజెక్ట్ పొడవు 12.24 కిలోమీటర్లు భారత్ లో 6.78 కి.మీ. బంగ్లాదేశ్ లో 5.46 కి.మీ. మేర వరకు దీని నిర్మాణం జరిగింది. భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 392.52 కోట్లు ఖర్చు చేసింది అని తెలిపారు.