‘అఖండ’ హిందీ డబ్బింగ్ హక్కులను దక్కించుకున్న పెన్ ఇండియా లిమిటెడ్

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతుంది. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ మూవీగా గత వారం భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం రికార్డ్స్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటీకే పలు రికార్డ్స్ బ్రేక్ చేసిన బాలయ్య..వంద కోట్ల వైపు పరుగులు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ కలెక్షన్లను రాబడుతోంది.

ఈ క్రమంలో ఈ మూవీ రీమేక్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. తాజాగా హిందీ డబ్బింగ్ రైట్స్ ను పెన్ ఇండియా లిమిటెడ్ దక్కించుకున్నట్లు సమాచారం. అంతేకాదు, ఈ హక్కులను ఇద్దరు హీరోలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ చిత్రాన్ని అక్షయ్ కుమార్‌తో కానీ, అజయ్ దేవగణ్‌తో కానీ రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయని బీ టౌన్‌ సమాచారం.

ఇక అఖండ తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల కలెక్షన్స్ చూస్తే ఈ విధంగా ఉన్నాయి

నైజాంలో రూ. 16.50 కోట్లు
సీడెడ్‌లో రూ. 12.50 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 5.10 కోట్లు
ఈస్ట్ గోదావరిలో రూ. 3.39 కోట్లు
వెస్ట్ గోదావరిలో రూ. 2.80 కోట్లు
గుంటూరులో రూ. 3.96 కోట్లు
కృష్ణాలో రూ. 2.99 కోట్లు
నెల్లూరులో రూ. 2.15 కోట్లు వచ్చాయి. ఇక రెండు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 49.34 కోట్లు షేర్ వచ్చినట్లు తెలుస్తోంది.