వరద బాధితులను ఆదుకోండి.. అభిమానులకు చిరంజీవి పిలుపు

Chiranjeevi
Chiranjeevi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప , చిత్తూరు , ప్రకాశం , నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్ష బీబత్సం సృష్టిస్తుంది. ఈ వర్షాలకు వేలాది ఎకరాలు నీటమునగగా..కోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది. రోడ్ల తెగిపోయాయి. చెరువుల ఆనకట్టలు తెగిపోయాయి. దీంతో వరద మొత్తం గ్రామాలపై పడింది. ఈ వరదలతో చాల గ్రామాలూ నీటమునిగాయి. రెండు రోజులుగా తిండిలేక , త్రాగడానికి నీరు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి వరద బాధితులను ఆదుకోండి.. అంటూ అభిమానులకు పిలుపునిచ్చారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతుండడం చూస్తుంటే మనసును కలిచివేస్తున్నాయన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో తిరుపతి, తిరుమల పరిస్థితులపై పోస్ట్ చేశారు. “గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కోంటున్న ఇబ్బందులు మనసును కలచివేస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం, టీటీడీలు కలిసికట్టుగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు, అలాగే అభిమాన సంఘాలు సైతం చేయూత నివ్వాల్సిందిగా కోరుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

#RainFuryInTirupathi
Appeal to State Government, TTD,All Political Parties, Fans Associations & Good Samaritans to extend all possible help to restore normalcy asap. pic.twitter.com/XugKJsh1Z6— Chiranjeevi Konidela (@KChiruTweets) November 19, 2021