అమెరికాలో’అఖండ’ ఫాన్స్ హంగామా!

బాలకృష్ణ తాజా చిత్రం విడుదల సందర్భంగా భారీగా కార్ల ర్యాలీ

'Akhanda' fans buzz in America
Balakrishna ‘Akhanda’ fan buzz in Dallas

అమెరికాలో నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ’ విడుదల సందర్భంగా ఆయన ఫాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారు. థియేటర్ వద్దనే కొబ్బరి టెంకాయలు కొట్టి హంగామా చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. డల్లాస్ లోని ‘అఖండ’ ప్రదర్శిస్తున్న థియేటర్ కి వెళుతూ టెక్సాస్ లోనే బాలయ్య అభిమానులు రచ్చ రచ్చ చేశారు. డల్లాస్ బాలయ్య యువసేన పేరుతొ పసుపు బ్యానర్ లతో జై బాలయ్య నినాదాలతో భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. అమెరికాలో చాలా లొకేషన్లలో ‘అఖండ’ విడుదలై విజయవంతంగా ఆడుతోంది.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/