చిత్రసీమలో విషాదం : మహేష్ బాబు తల్లి కన్నుమూత

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో విషాదం చోటుచేసుకుంది. రీసెంట్ గా రెబెల్ స్టార్ కృష్ణం రాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మరణ వార్త నుండి ఇంకా సినీ లవర్స్ బయటపడకముందే మరో విషాదం చోటుచేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దీ రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో హైద‌రాబాద్‌లో ఏఐజీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం ఆమె క‌న్నుమూశారు. సూపర్ స్టార్ కృష్ణ మొద‌టి భార్య ఇందిరా దేవి. వీరికి ముగ్గురు కూతుళ్లు..ఇద్ద‌రు కొడుకులు. ప‌ద్మ‌, మంజుల‌, ఇందిరా ప్రియ‌ద‌ర్శిని. ర‌మేష్ బాబు, మ‌హేష్ బాబు.

ఇద్దరు కొడుకులు సినిమాల్లో ఉన్నప్పటికీ, ఏ రోజూ సినిమా వేడుకలకు హాజరు కావడానికి ఉత్సాహం చూపేవారు కాదు ఇందిరాదేవి. ఇందిరాదేవి పుట్టినరోజున, మదర్స్ డే రోజున, విమెన్స్ డే రోజున ప్రత్యేకంగా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టి, తనకు తల్లి పట్ల ఉన్న మమకారాన్ని అభిమానులతో పంచుకునేవారు మహేష్‌. ఆ మధ్య విజయ్‌ నిర్మల, ఇటీవల రమేష్‌బాబు మృతితో దిగాలుచెందిన సూపర్‌స్టార్‌ కృష్ణకు… ఇప్పుడు ఇందిరాదేవి దూరం కావడం మరింత బాధాకరం.