లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
trs-mps-continue-their-protest-in-lok sabha-demanding-crop-procurement
న్యూఢిల్లీ: నేడు కూడా టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం వద్ద ప్లకార్డులతో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం సేకరణపై జాతీయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో నినాదాలు చేశారు. గత అయిదు రోజుల నుంచి లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/