డబుల్‌ బూస్టర్‌ డోస్‌కు అనుమతి ఇవ్వండి..కేంద్రానికి ఐఎంఏ సిఫారసు

Covid Vaccination-File
Need for fourth vaccine amid threat of new wave of Corona, I told need for double booster

న్యూఢిల్లీః పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లోనూ మరో మరో వేవ్‌ తప్పదా? అనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో కొవిడ్‌ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న కేంద్రం.. మహమ్మారి వ్యాపించకుండా చర్యలు చేపట్టింది. ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ వరుస సమావేశాలు నిర్వహిస్తూ అధికారులను సన్నద్ధం చేస్తున్నారు. సోమవారం ఆరోగ్యశాఖ మంత్రి ఐఎంఏతో సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో డబుల్‌ బూస్టర్‌ డోస్‌ (నాలుగో టీకా) ఐఎంఏ నొక్కి చెప్పింది. పలు దేశాల్లో నాలుగో డోసు వేసినా ప్రస్తుతం దారుణ పరిస్థితులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో భారత్‌లో డబుల్‌ బూస్టర్‌ డోస్‌ వేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆరోగ్యశాఖ మంత్రిని కోరింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజలకు రెండు డోసుల టీకా ఇవ్వగా.. ఆ తర్వాత ప్రికాషనరీ డోస్‌ ఇస్తున్నది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/