జోరు మీదున్న ప్రియాంక జవాల్కర్

“తిమ్మరుసు” లో నటనకు ప్రశంసలు

జోరు మీదున్న ప్రియాంక జవాల్కర్
Priyanka Jawalkar is happy

లేటెస్ట్ ఫిల్మ్ “తిమ్మరుసు” హిట్ తో మరో విజయాన్ని ఖాతాలో  వేసుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ చేసిన లాయర్ అను క్యారెక్టర్ కుమంచి రెస్పాన్స్ వస్తోంది. “తిమ్మరుసు” లో ప్రియాంక అందంగా కనిపిస్తూనే, కంప్లీట్ పర్మార్మెన్స్ ఇచ్చిందని ఆడియెన్స్ అంటున్నారు. ఈ సినిమాలో ప్రియాంక కాంట్రిబ్యూషన్ ను అటుఫిల్మ్ యూనిట్ కూడా ప్రశంసిస్తోంది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకున్న ప్రియాంక.. “తిమ్మరుసు” హిట్ తో టాలీవుడ్ లో మరింత జోరు పెరిగేలా కనిపిస్తోంది. ఆగస్టు 6న ప్రియాంక జవాల్కర్ నటించిన మరో కొత్త సినిమా “ఎస్ఆర్ కళ్యాణమండపం” విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ష్యూర్ హిట్ అనే టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/