‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ రావడానికి కారణం నేనే – అజయ్ దేవగన్

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు తో తెలుగు సినిమా స్థాయి హాలీవుడ్ స్థాయికి చేరింది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి పెంచిన రాజమౌళి..ఆర్ఆర్ఆర్ తో మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఇక నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం తో యావత్ దేశ ప్రజలు తెలుగు సినిమా ఫై ప్రశంసలు కురిపించారు. ప్రధాని దగ్గరి నుండి చిన్న స్థాయి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరు స్పందించారు.

తాజాగా చిత్రంలో నటించిన అజయ్ దేవగన్ ..నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడానికి కారణం నేనే అని తెలిపి షాక్ ఇచ్చారు. అజయ్ తాజాగా నటించిన ‘భోళా’ మూవీ మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ హీరో కార్తీ, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబో తెరకెక్కిన ‘ఖైదీ’ మూవీకి ఇది రిమేక్. ఈ సినిమాలో టబు ఓ కీలకపాత్రలో నటించింది. ఈ తరుణంలో ఈ మూవీ టీం ప్రమోషనల్ కార్యక్రమాలను జోరుగా సాగిస్తోంది. అందులో భాగంగా.. ప్రముఖ కామెడీ రియాలిటీ షో ‘ది కపిల్ శర్మ షో’కి అజయ్, టబు అతిథులుగా వచ్చారు.

అందులో.. ‘నాటు నాటు’కి ఆస్కార్ రావడం గురించి హోస్ట్ కపిల్ శర్మ ప్రశ్నించాడు. దానికి.. ‘నా వల్లే ఆర్ఆర్ఆర్‌కి ఆస్కార్ వచ్చింది’ అని అజయ్ బదులిచ్చాడు. అది విన్న కపిల్ షాకై.. అదేలా అని అడిగగా.. ‘ఆ పాటకి నేను డ్యాన్స్ చేస్తే పరిస్థితి ఎంటీ?’ అని ఆ స్టార్ తనదైన శైలిలో ఫన్నీగా వ్యాఖ్యానించాడు.
ఈ వైరల్ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందించారు.