ఘర్షణలో పాల్గొన్నజవాన్లను ప్రశంసించిన ఆర్మీ చీఫ్‌

ప్రశంసా బ్యాడ్జీలను బహూకరించిన ఆర్మీ చీఫ్‌ జనరల్ ఎంఎం నరవణే

In visit to forward areas in eastern Ladakh, Army chief commends

లేహ్‌: భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌ జనరల్ ఎంఎం నరవణే రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం లడఖ్‌ వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఆయన బుధవారం తూర్పు లడఖ్‌లోని సరిహద్దు ప్రాంతలను సందర్శించారు. గల్వాన్‌ లోయ వద్ద చైనాతో ఇటీవల ఘర్షణ జరిగిన నేపథ్యంలో అక్కడి పరిస్థితి, సైనిక సన్నద్ధతపై ఆర్మీ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. చైనా ఘర్షణలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లను ఆయన ప్రశంసించారు. వారికి ప్రశంసా బ్యాడ్జీలను బహూకరించారు. మరింత ఉత్సాహంతో పనిచేయాలని ప్రోత్సహించారు. ఈ నెల 15-16 తేదీల్లో చైనాతో జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుతో సహా 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసింది. ఈ ఘర్షణలో 70 మందికిపైగా జవాన్లు గాయపడ్డారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/