ఎయిర్‌ ఇండియాలో భారీగా ఉద్యోగ నియామకాలు

Air India's B747 Plane Departs From Delhi To Wuhan
Air India

న్యూఢిల్లీః భారత కంపెనీ ఎయిరిండియా శుభవార్త చెప్పింది. టాటా గ్రూప్.. ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను కొనుగోలు చేసిన తర్వత సేవలను భారీగా విస్తరించే పనిలో పడింది. తాజాగా 470 విమానాల కొనుగోలుకు ఎయిర్‌‌బస్‌, బోయింగ్ సంస్థలతో భారీ డీల్ కుదుర్చుకున్న టాటా.. ఇప్పుడు భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. కేబిన్ సిబ్బంది, పైలట్లు కలుపుకొని మొత్తం 5,100 మందిని తీసుకోనున్నట్లు టాటా గ్రూప్ వెల్లడించింది.

అంతర్జాతీయ సేవలను విస్తరించే నేపథ్యంలో ఉద్యోగుల నియామకం ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. 5,100 ఉద్యోగాల్లో4,200 మందిని ట్రైనీ కేబిన్‌ సిబ్బందిగా, 900 మంది పైలట్లను తీసుకోనున్నారు. వాళ్లకు 15 వారాలు శిక్షణ ఉంటుంది.