క్లౌడ్‌ కమ్యూనికేషన్‌ మార్కెట్లోకి ఎయిర్‌టెల్‌

ఎయిర్‌ ఐక్యూ ..ఓమ్నీ కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫాం ఏర్పాటు

AIRTEL
AIRTEL

ముంబై: భారతీ ఎయిర్‌టెల్‌ క్లౌడ్‌ కమ్యూనికేషన్‌ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఎయిర్‌ ఐక్యూ అనే ఓమ్నీ కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసింది.

ఇండియన్‌ ఎంటర్‌ప్రైజ్‌ కమ్యూనికేషన్స్‌లో ఇదో విప్లవాత్మక మార్పుగా ఎయిర్‌టెల్‌ పేర్కొంది.

భారత్‌లో ప్రస్తుతం క్లౌడ్‌ కమ్యూనికేషన్‌ మార్కెట్‌ విలువ ఒక బిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్రతి సంవత్సరం ఇరవై శాతం వృద్ధి సాధిస్తోంది. ఈ రంగంలోకి అడుగుపెట్టిన మొదటి టెలికం ఆపరేటర్‌ ఎయిర్‌టెల్‌.

ఇప్పటికే ఎయిర్‌ ఐక్యూ సేవల కోసం స్విగ్గి, జస్ట్‌ డయల్‌, అర్బన్‌ కంపెనీ, హావిల్స్‌, డాక్టర్‌ లాల్‌పత్‌ లాబ్స్‌, రాపిడో సంతకాలు చేశాయి.

ఇవి ఎయిర్‌టెల్‌ ఐక్యూ బిటా వర్షన్‌ను ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం ఇది వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చింది.

సేవలు ఉపయోగించుకున్నంత వరకే చెల్లింపులు జరిపే వెసులుబాటుంది. ప్రస్తుత మోడల్స్‌తో పోలిస్తే ఈ ప్లాట్‌ఫాం కంపెనీలకు దాదాపు నలభై శాతం ఖర్చు తగ్గిస్తుందని ఎయిర్‌టెల్‌ బిజినెస్‌ డైరెక్టర్‌ అండ్‌ సిఇఒ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/