ఇటలీలో 5,500కు పెరిగిన కరోనా మృతులు

ఆదివారం ఒక్క రోజే 651 మంది మృతి

reports 5,500 coronavirus deaths
reports 5,500 coronavirus deaths

ఇటలీ: కరోనా వైరస్‌తో ఇటలీ అలాడుతుంది. ఆదివారం ఒక్క రోజే 651 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,500కు పెరిగింది. ఫ్రాన్స్‌లో 562 మంది మరణించగా, పారిస్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగం వైద్యుడు (67) ఒకరు కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు. బ్రిటన్‌లో కరోనా ముప్పు ఉందని భావిస్తున్న 15 లక్షల మందిని మూడు నెలలపాటు బయటకు రావొద్దని అక్కడి ప్రభుత్వం సూచించింది. స్పెయిన్‌లో తాజాగా మరణించిన 394 మందితో కలుపుకుని ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 1720కి చేరింది. కాగా ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 13 వేలకు చేరింది. బాధితుల సంఖ్య మూడు లక్షలపైనే నమోదైనాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/