27నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం

Flights to Britain from today!
flights

హైదరాబాద్: కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు తెలిపింది. మార్చి 27నుంచి సర్వీసులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. దీంతో రెండు సంవత్సరాల తర్వాత విమాన సర్వీసులకు మోక్షం లభించనుంది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని విమాన సర్వీసులను నడపనున్నట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఎయిర్​బబుల్ నిబంధన సైతం ఎత్తివేయనున్నట్లు ఆ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. విమాన సంస్థలు కేంద్ర వైద్య శాఖ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని తేల్చి చెప్పారు. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై సస్పెన్షన్ విధించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/