ప్రధాని మోడీకి ధన్యవాదాలు : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

సుమీ నుంచి భారత విద్యార్థుల తరలింపు మోడీ కి స్పెషల్ థ్యాంక్స్..షేక్ హసీనా

Sheikh Hasina-PM Modi
Sheikh Hasina-PM Modi

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత ప్రధాని నరేంద్ర మోడీ కి.. ధన్యవాదాలు తెలియజేశారు. తమ దేశ పౌరులను యుద్ధ భూమి ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా తరలించడంలో సాయపడినందుకు కృతజ్ఞతలు తెలిపారు . ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ లోని సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారతీయులను పోల్తావాకు తరలించే చర్యలను భారత ఎంబసీ అధికారులు మంగళవారం చేపట్టారు. రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించడంతో ఇది సాధ్యపడింది. దీంతో కీవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మౌరిపోల్ ప్రాంతాల్లోకి ప్రవేశించే మార్గాలు ఏర్పడ్డాయి.

సుమీ నుంచి 12 బస్సులతో కూడిన భారత వాహన కాన్వాయ్ పోల్తావాకు బయలుదేరి వెళ్లింది. భారత ఎంబసీ, రెడ్ క్రాస్ ప్రతినిధులు బస్సుల వెంట ఉన్నారు. ఈ కాన్వాయ్ లో భారతీయులతోపాటు బంగ్లాదేశ్ కు చెందిన తొమ్మిది మంది, ఒక నేపాలి, ఒక ట్యూనీషియా విద్యార్థి కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ పౌరులకు కూడా సాయం అందించడం పట్ల షేక్ హసీనా ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/