కౌమార దశలో వారికి ఇవి నేర్పుతున్నారా?

యుక్త వయసు పిల్లల ఆరోగ్య సంరక్షణ

యుక్త వయస్సు లోకి అడుగు పెడుతున్న పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కలిసిగిన్చాలంటున్నారు నిపుణులు.. లేదంటే పలు రకాల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.. ఉదయం ఆలస్యంగా లేవటం , ఆపై సమయం మించి పోతోందని త్వరగా బ్రష్ ముగించటం.. రాత్రేమో భోజనం తర్వాత అలసి, పోయాక నోఋ శుభ్రం చేసుకోకుండానే పక్క మీదకు చేరటం ..ఇలాంటివి పిల్లలు చేస్తుంటే ముందే వారించండి.. భవిష్యత్తు లో నోటికి సంబందించిన అనారోగ్యాలకు దారితీస్తాయని, అవగాహన కలిగించాలి.. కచ్చితంగా రోజూ రెండుసారు బ్రష్ చేసేలా చూడండి..

అలవాట్లు:

స్నానం సరిగ్గా చేయకపోతే కలిగే నష్టాలు చెప్పి, చర్మ ఆరోగ్యం పై అవగాహన కలిగించాలి.. బాగా చెమట, దుమ్ముతో అలాగే పడుకుంటే మొటిమలు, మచ్చలు వస్తాయని చెప్పండి.. నిద్ర పోయే ముందు ముఖాన్ని తప్పక శుబ్రా పర్చుకోమనండి.. స్కూల్ నుంచి రాగానే స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు డ్రారించటం అలవాటు చేయాలి.. లోదుస్తులు మార్చక పోవటం, బిగుతైన దుస్తులతో నిద్ర పోవటం మంచిది కాదని తెలియజేయాలి..

నెలసరిలో :

నెలసరి మొదలైనపుడు అవగాహన తక్కువగా ఉంటుంది… అయోమయానికి గురవుతూ వుంటారు.. ఇటువంటపుడు పరిశుభ్రత తో పాటు ప్యాడ్ మార్పిడి సమయాన్ని చెప్పాలి.. దాని ఎంపికలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలి… జననాంగాల పరిశుభ్రత అవసరాన్ని తెలియజేయాలి.. నెలసరి సమయంలో హార్మోన్లలో మార్పులొస్తాయి.. వాటిపై అవగాహనతో పాటు ఆ సమయంలో మొటిమలు, మచ్చలు సాధారణం, కంగారు పడొద్దని భరోసా ఇవ్వండి… దూరం చేసుకోవటంలో సాయమూ చేయండి.. ముఖం, పెదాలపై గోళ్ళతో నిత్యం గిల్లుతుంటారు. ఆలా చేయకుండా చూసుకోవాలి..

వ్యాయామంతో..

నిత్యం చేసే వ్యాయామం , నడక, నృత్యం, క్రీడలు వంటివి ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షిస్తాయో చెప్పాలి.. పెద్ద వాళ్ళు ఏ నియమాన్ని పాటిస్తే పిల్లలూ అనుసరిస్తారు… వాళ్లకూ ఆసత్కి ఉంటుంది.. వ్యాయామం భౌతికంగానే కాదు.. మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తుంది.. నిద్ర వాళ్ళ కలిగే ఆరోగ్య ప్రయోగాణాల్తో పాటు రోజుకి 7,8 గంటలు నిద్ర ముఖారవిందాన్ని మరింత తాజాగా మార్చగలడో చెప్పాలి.. ఇవే కాకుండా అలర్జీలు రాణి పౌడర్ , సెంటు ఎంచుకోవటం నేర్పాలి.. వీటిని వినియోగించటంలో అవగాహన కల్పించాలి.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/category/andhra-pradesh/