సిద్ధార్థ్ తో ప్రేమాయణం ఫై హీరోయిన్ అదితి క్లారిటీ ఇచ్చినట్లేనా..?

బొమ్మరిల్లు ఫేమ్ సిద్దార్థ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమాల కంటే హీరోయిన్స్ తో ఎఫర్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. శృతి హాసన్ , సమంత , సైఫ్ అలీఖాన్ ఇలా మనోడి లిస్ట్ పెద్దగానే ఉంది. 2003లో మేఘన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్ 2007లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత పలువురు హీరోయిన్ల తో ప్రేమాయణం సాగించినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఇప్పుడు గత కొద్దీ రోజులుగా అదితీరావ్ హైదరీతో సిద్దార్థ్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పలుమార్లు ఇద్దరు కలిసి ముంబై విధుల్లో తిరుగుతూ కనిపించిన వీడియో లు బయటకొచ్చాయి. తాజాగా అదితీరావ్ హైదరీ తన సోషల్ మీడియా పేజీ లో ఓ వీడియో పెట్టడం తో అందరికి ఓ క్లారిటీ వస్తుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలిసిపోతుంది. ఈమె పోస్ట్ చేసిన వీడియో లో ఇందులో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం చూస్తుంటే… చాన్నాళ్ల నుంచి కలిసి ఒకే ఇంట్లోనూ ఉంటున్నారా అనిపిస్తుంది.