హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఆదిపురుష్ టికెట్స్

ప్రభాస్ – కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణాసురుడుగా కనిపిస్తుండగా రాముడి గా ప్రభాస్ , సీతగా కృతి కనిపించనున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. జూన్ 16 న పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వగా..అన్ని చోట్ల హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడవుతున్నాయి.

ఆదిపురుష్ రిలీజ్ కాబోయే థియేటర్స్ లకి సంబంధించి టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఓవర్సీస్ లో అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసుకుంటే గట్టిగానే ఉన్నాయని చెప్పాలి. ఆదిపురుష్ త్రీడీ వెర్షన్ కోసం 13.6 శాతం అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయంట. దీని ద్వారా. 2.3 కోట్లు ఈ సినిమా కి అప్పుడే కలెక్షన్ వచ్చేసింది. ఇక 2డీ వెర్షన్ లో 7.9 శాతం ఆక్యుపెన్సీకి అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. వీటి ద్వారా 23 లక్షల కలెక్షన్ వచ్చింది. ఎక్కువ మంది ఆదిపురుష్ చిత్రాన్ని త్రీడీ లో చూడటానికి ఇష్టపడుతున్నారు. అందుకు తగ్గట్లుగానే వాటికే ఎక్కువ బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తుంది.

ఇక తెలుగు రాష్ట్రాల లో ఈ సినిమా పై 120 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. నైజాంలో – 50 కోట్లు, సీడెడ్- 17.60 కోట్లు, ఉత్తరాంధ్ర – 14.50 కోట్లు, తూర్పు గోదావరి – 8.80 కోట్లు, పశ్చిమ గోదావరి – 7.20 కోట్లు, గుంటూరు – 8.60 కోట్లు, కృష్ణా జిల్లా – 8.50 కోట్లు, నెల్లూరు – 4.80 కోట్ల బిజినెస్ జరిగింది.