తమిళ హీరో విజయ్‌కు ఐటీ నోటీసులు

Hero Vijay
Hero Vijay

చెన్నై: తమిళనాడులో సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఇటీవల ఆదాయ పన్ను శాఖ జరిపిన సోదాలు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. స్టార్‌ హీరో విజయ్‌ ఇంటిపై ఐటీ దాడులు మరింత హీట్‌ను పెంచాయి. కక్షతోనే బీజేపీ ఆదాయపన్ను శాఖతో దాడులు చేయిస్తోందని విమర్శలు వచ్చాయి. కాగా, ఐటీ అధికారులు ఈ రోజు మరో అడుగు ముందుకేశారు. పన్నును ఎగ్గొట్టారన్న ఆరోపణలపై ఆయనకు సమన్లు జారీ చేశారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ నిర్మాత అన్బు చెజియాన్‌ పన్ను ఎగవేత కేసులోనూ విజయ్‌ జోక్యం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపైనే తమకు సమాధానం చెప్పాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా హీరో విజయ్‌ నటించిన మెర్శల్‌ చిత్రంలో పలు అంశాలు బిజెపిని టార్గెట్‌ చేసినట్లు ఉన్నాయని అప్పట్లో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందించకపోవడం, జీఎస్‌టీ వసూళ్లు వంటి సన్నివేశాలు
బిజెపి నేతలను ఆగ్రహానికి గురి చేశాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/