ఓపెన్‌ సోర్స్‌ నిపుణులకు పెద్దపీట

ఈ ఏడాది ఐటి కంపెనీల నియామకాల్లో ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌లలో నైపుణ్యం కలవారికే అత్యధిక ప్రాధాన్యత లభించనుందని ది లినక్స్‌ ఫౌండేషన్‌, డైస్‌.కాంలు సంయుక్తంగా నిర్వహించిన ఓపెన్‌ సోర్స్‌ జాబ్‌ రిపోర్ట్‌ వెల్లడిస్తోంది. నాలుగు వందల ఐటి కంపెనీల రిక్రూట్‌మెంట్‌ మేనేజర్లను, 4500మంది ఓపెన్‌సోర్స్‌ నిపుణులను సర్వేచేసి తయారుచేసిన నివేదిక ప్రకారం 65శాతం మంది ఐటి రిక్రూట్‌మెంట్‌ మేనేజర్లు తాము రాబోయే ఆరునెలల్లో జరప బోయే నియామకాల్లో ఓపెన్‌సోర్స్‌ నిపుణులకు పెద్దపీట వేస్తామని చెప్పారు.

ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో ప్రజలను పరస్పరం అనుసంధానించడంలో ఓపెన్‌సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రధాన పాత్ర పోషిస్తుండటమే దీనికి కారణం, అలాగే ఓపెన్‌సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌లలో నైపుణ్యం కలవారి సంఖ్య కూడా తక్కువ ఉండటం కూడా వారికి ఎక్కువ డిమాండ్‌ ఉండటానికి కారణమవుతోంది. ఐటి నియామకాల పోటీ ప్రపంచంలో మీ విలువ పెంచుకోవాలంటే ఈ కింది ఓపెన్‌సోర్స్‌ విభాగాలలో నైపుణ్యం ఉండటం మంచిదని నివేదిక సూచిస్తోంది. ఓపెన్‌సోర్స్‌ నిపుణులలో డెవలపర్లకే అగ్రస్థానం అని హైరింగ్‌ మేనేజర్లు స్పష్టంగా చెబుతున్నారు.

లైనక్స్‌, యునిక్స్‌, హడూప్‌, అపాచీ తదితర ప్లాట్‌ఫాంలపై అప్లికేషన్లు డెవలప్‌ చేసి రన్‌చేయగల శక్తి ఉన్నవారికి వారు పెద్ద పీట వేయడానికి సిద్ధంగా ఉన్నారు.
వేగంగా విస్తరిస్తూ నిపుణుల మన్ననలు పొందు తున్న సరికొత్త సిస్టం మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫాం డేవ్‌-ఆప్స్‌లో అవగాహన అనుభవం ఉన్నవారికి తమ టీంలో సముచిత స్థానం ఇవ్వడానికి హైరింగ్‌ మేనేజర్లు సిద్ధంగా ఉన్నారు.

మీ చేతిలోని కంప్యూటర్‌ లేదా మొబైల్‌ ఫోన్‌ను ఇంటర్‌నెట్‌ అనుసంధానించి పరిమిత మైన హార్డ్‌వేర్‌ వనరులతో అపరిమితమైన ఐటిపనులు చేయించగలిగే సాంకేతిక విభాగ మే క్లౌడ్‌ టెక్నా లజీ. ఓపెన్‌సోర్స్‌ క్లౌడ్‌ టెక్నాలజీ నిపుణులకు స్వాగతం చెప్పేం దుకు ఐటీ కంపెనీలు ఉవ్విళూ రుతున్నాయి. ఐటి ప్రపంచంలో ఎవర్‌గ్రీన్‌ విభాగం ఏదైనా ఉందంటే అది నెట్‌వర్కింగే. ఓపెన్‌ సోర్స్‌లోనూ నెట్‌వర్క్‌ిం నిపుణులకు అధిక ప్రాధాన్యత ఉందని తాజా నివేదిక వెల్లడించింది. 21శాతం మంది హైరింగ్‌ మేనేజర్లు తాము నెట్‌వర్కింగ్‌ నిపుణుల కోసం చూస్తున్నామని చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/