తనకు ప్రాణ హాని ఉందంటూ ఎస్పీ దగ్గరికి వెళ్లిన సినీ నటుడు నరేష్

సీనియర్ నటుడు నరేష్..తనకు ప్రాణ హాని ఉందని తుపాకి లైసెన్స్ ఇప్పించగలరంటూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డిని కోరారు. గత కొద్దీ నెలలుగా నరేష్ పేరు వార్తల్లో హైలైట్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలకన్నా వ్యక్తిగత విషయాలతో ఈయన వార్తల్లో నిలుస్తుంటారు. రీసెంట్ గా మళ్లీ పెళ్లి అంటూ వైరల్ అయ్యారు.

నిన్న పుట్టపర్తిలో ఎస్పీని కలిసిన ఆయన మావోయిస్టుల నుంచి తనకు ప్రాణహాని ఉండడంతో 2008లో లైసెన్స్ రివాల్వర్ తీసుకున్నట్టు తెలిపారు. మళ్లీ దానికి అనుమతి ఇవ్వాలని గతంలో కోరినా ఇవ్వలేదని, ఇప్పుడు హిందూపురంలో ఉంటున్న తనకు లైసెన్స్ రివాల్వర్‌ను తన వద్ద ఉంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డిని కోరారు. దీనిపై ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.