ఆంధ్రాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు

బాలీవుడ్ నటుడు సోనూసూద్ నిర్ణయం

Sonu sood
Sonu sood

Nellofe: నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు బాలీవుడ్ నటుడు సోనూసూద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరులో సోనూ మిత్రుడు సమీర్ ఖాన్ కుటుంబ సభ్యులు ఇటీవల కరోనాతో మృతి చెందారు. ఆసుపత్రులలో ఆక్సిజన్ పడకలు దొరకకపోవడమే వారి మృతికి కారణమని తెలిసింది. దీంతో సమీర్ ఖాన్ కోరిక మేరకు నెల్లూరు జిల్లాలో రూ. 1.5 కోట్ల ఖర్చుతో ఆక్సిజన్ ప్లాంట్‌ను నెలకొల్పాలని సోనూసూద్ నిర్ణయించారు

ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూ ముందుకొచ్చిన విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సమీర్ తీసుకెళ్లారు . సోనూతో ఫోన్‌లో మాట్లాడించాడు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆత్మకూరు, కావలిలో సరైన స్థలం కోసం అన్వేషణ చేపట్టారు. ఆక్సిజన్ ప్లాంట్‌ ఏర్పాటుకు సోనూ ముందుకొచ్చిన విషయాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ధ్రువీకరించారు. రెండు టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటుకు నిధులను సోనూసూద్ అందిస్తున్నారని వెల్లడించారు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/