ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న మెగా మూవీ ఆచార్య. ఇక ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. కాజల్ , పూజా హగ్దే లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఏప్రిల్ 29 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలతో బిజీ గా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుండి సినిమా వస్తుండడం..సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండడం..చిరంజీవి – చరణ్ లు కలిసి నటిస్తుండడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ అంచనాల నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఆ వివరాలు చూస్తే..

‘ఆచార్య’ చిత్రానికి రూ. 133 కోట్లు ప్రిరిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. అందులో నైజామ్ కు ఏకంగా రూ. 38 కోట్లు బిజినెస్ జరుగగా.. సీడెడ్ రూ. 20.05 కోట్లు బిజినెస్ జరిగినట్టు సమాచారం. అలాగే.. యూఏ బాక్సాఫీస్ వద్ద రూ. 13 కోట్లు బిజినెస్ జరిగింది. ఇంకా ఏపీ, తెలంగాణా కలిపి మొత్తంగా రూ. 109.2 కోట్లరు బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ జోడిగా నటించగా.. రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటించారు.