మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు ఆదేశాలు
రాష్ట్రంలో తక్షణమే ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని అమలు చేయాలి
Supreme Court orders Mamata Banerjee
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై మండిపడింది. రాష్ట్రంలో తక్షణమే ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ఎలాంటి సాకులూ చూపకుండా, రాష్ట్రంలో వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఈ పథకం వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన పథకం. మీరు సమస్యలను ఉదహరించకుండా పథకాన్ని అమలు చేయాలి’’ అని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/