న్యూ ఇయర్ మెగా గిఫ్ట్ : ఆచార్య నుండి ‘సానా కష్టం’ సాంగ్ వచ్చేస్తుంది..

ఆచార్య నుండి మెగా న్యూ ఇయర్ గిఫ్ట్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను డైరెక్షన్ చేస్తుండడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో రోల్‌లో నటిస్తుండగా..ఆయనకు జోడి గా పూజా హగ్దే నటిస్తుంది.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుండి ‘లాహే లాహే’ , ‘నీలాంబరి’ పాటలు విడుదలై శ్రోతలను విశేషంగా అలరించాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. మేకర్స్ ‘ఆచార్య’ సినిమాలోని మూడో పాటను రిలీజ్ చేస్తున్నారు. సానా కష్టం’ అనే పాట లిరికల్ వీడియోని జనవరి 3వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇది హై వోల్టేజ్ పార్టీ సాంగ్ అని.. 2022ని ఈ పాటతో ప్రారంభిద్దామని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ సందర్భంగా చిరంజీవి కి సంబంధించిన ఓ పోస్టర్ ని రిలీజ్ చేసి మెగా అభిమానుల్లో సంతోషం నింపారు.

ఈ పోస్టర్ లో చిరంజీవి బ్లూ కలర్ డెనిమ్ షర్ట్ – బ్లాక్ కార్గో ప్యాంటు ధరించి వీణ స్టెప్పు తరహా భంగిమలో కనిపిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేసిన ఈ డ్యాన్స్ నంబర్ లో చిరు తో పాటుగా హీరోయిన్ రెజీనా కాసండ్రా ఆడిపాడనుందని తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022 ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.