బాహుబలి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న ఆర్ఆర్ఆర్

రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి పార్ట్ 1 , 2 లు ఎంత పెద్ద విజయం సాధించాయో తెలియదు కాదు..తెలుగు సినిమా సత్తా ను వరల్డ్ వైడ్ గా చాటిచెప్పాయి. ఇక ఈ మూవీ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక ఇప్పుడు బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్.

తెలుగు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా జనవరి 07 వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అలాగే, టర్కిష్, స్పానిష్, పోర్చుగీస్, కొరియన్, జపనీస్, చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో కూడా దీన్ని డబ్బింగ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో సినిమాను అన్ని చోట్ల భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో ప్రమోషన్ చేయగా..త్వరలో తిరుపతి నగరంలో ఈవెంట్ చేయబోతున్నట్లు సమాచారం. ముందుగా బాహుబలి ది గిబిగినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్కడే నిర్వహించారు. ఆ సెంటిమెంట్ గానే ఆర్ ఆర్ ఆర్ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ అక్కడే ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటె రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ ముంబై ఈవెంట్ ని ఈరోజు రాత్రి 11 గంటలకు జీటీవీ..జీ సినిమాస్ లో టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ టీమ్ చరణ్- ఎన్టీఆర్ ఒకర్ని ఒకరు హత్తుకుని ఉన్న ముంబై ఈవెంట్ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసారు. ఆ పక్కనే రాజమౌళి..శ్రియ కూడా స్టేజ్ పై ఉన్నారు.ఈ రాత్రికి ఈవెంట్ ప్రసారం అయితే చాలా మంది చూసే అవకాశం ఉంది. అందరూ న్యూ ఇయర్ వేడుకల్లో బిజీ అవుతారు. రాత్రంతా పార్టీలంటూ హడావుడి ఉంటుంది. ఆ ఎంజాయ్ మెంట్ లో ఆర్ ఆర్ ఆర్ ఈవెంట్ పై..సినిమాపై డిస్కషన్స్ జుగుతాయి. అందుకే టీమ్ ఇలా ప్లాన్ చేసినట్లు ఉంది.