తెలంగాణ లో ఈరోజు ఒక్క రోజే ఏడేళ్ల చరిత్ర రికార్డును తిరగరాసిన మద్యం అమ్మకాలు

న్యూ ఇయర్ సంబరమంతా మందు బాబులదే..ఈరోజు మాత్రమే మందు లభిస్తుందేమో అన్నట్లు సాయంత్రం నుండి వైన్ షాపుల ముందు మందుబాబులు బారులు తీరారు. జేబులో ఎంత డబ్బు ఉంటె అంత పెట్టి మద్యం సీసాలను తీసుకొని వెళ్తున్నారు. ఇవాళ ఒక్కరోజే సాయంత్రం 5 గంటల వరకు 40 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడేళ్ల చరిత్రలో మద్యం అమ్మకాల్లో ఇదే రికార్డని అంటున్నారు.

రాష్ట్రంలో 2 వేల 620 వైన్స్ షాపులుంటే…. వెయ్యి బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. మామూలుగా లిక్కర్ నెలకు 28 లక్షల కేసులు అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ నెలలో మాత్రం 40 లక్షల కేసుల అమ్మకాలు జరిగాయి. నెలకు 26 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. కానీ డిసెంబర్ లో మాత్రం 34 లక్షల కేసులు బీర్లు మద్యం డిపోల్ నుంచి అమ్మకాలు జరిగినట్లు తెలుస్తుంది. ఈరోజు అమ్మకాలతో సర్కార్ కు ఫుల్ కిక్ రావడం ఖాయం. ఇక న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈరోజు వైన్ షాపులు 12 గంటల వరకు, బార్లకు ఒంటిగంట వరకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైన్స్ ఓపెన్ చేసినప్పటికీ డ్రైంకన్ డ్రైవ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పింది.