నాగ్​పుర్​లో ఘోరం..అతి వేగం నలుగుర్ని బలితీసుకుంది

కారు సృష్టించిన బీభత్సానికి ఓ కుటుంబం బలైన ఘటన నాగ్​పుర్​లో చోటుచేసుకుంది. నగరంలోని సక్కర్దార వంతెన పై వేగంగా వస్తున్న ఓ కారు అదే దారిలో వస్తున్న వాహనాలపైకి దుసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.

వివరాల్లోకి వెళ్తే..

గణేశ్​ అధావ్ తన ఫ్రెండ్ కారు తీసుకుని బుట్టిబోరినికి వెళ్తున్నాడు. అర్ధరాత్రి అవ్వడం వల్ల బ్రిడ్జ్​పై ఎవరూ లేరని చాల స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మూడు వాహనాలను వరుసగా ఢీకొట్టాడు. అందులో ఓ బైక్​పై ఒక వ్యక్తి, అతని తల్లి, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తున్నారు.​ కారు ఢీకొట్టడం వల్ల వారు వంతెనపై నుంచి కింద పడిపోయారు. నీటిలో పడిపోయిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.