రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం..

ఢీకొన్న 6 కార్లు..రేవంత్ కు తప్పిన ప్రమాదం

accident-in-revanth-reddy-convoy

హైదరాబాద్‌ః టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళుతున్న కాన్వాయ్ లో 6 కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. అయితే కార్లలోని ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ కావడంతో రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన కార్లలో రెండు కార్లలో మీడియా ప్రతినిధులు ఉన్నారు. రెండు న్యూస్‌ ఛానళ్ల కార్లు ధ్వంసం అయ్యాయి. సిరిసిల్ల రిపోర్టర్లయిన వీరంతా స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.