ఏపీలో పీఆర్సీ ..ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగుల సమ్మె

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై తీవ్ర అసంతృప్తి
పోరాట కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు

అమరావతి: పీఆర్సీపై భగ్గుమంటున్న ఉద్యోగులను శాంతపరిచేందుకు ఓ వైపు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఉద్యోగ సంఘాలు కీలక ప్రకటన చేశాయి. రాష్ట్రంలో ఫిబ్రవరి 7 నుంచి సమ్మె చేస్తున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఏపీ సర్కారు ప్రకటించిన పీఆర్సీ తమకు ఆమోదయోగ్యం కాదని వివిధ ఉద్యోగ సంఘాలు కరాఖండీగా చెబుతున్నాయి. దాంతో, ఉద్యోగులతో సంప్రదింపుల కోసం సీఎం జగన్ ఓ కమిటీ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఉద్యోగ సంఘాలు పీఆర్సీ పోరాట కార్యచరణలో ముందుకు వెళ్లాలనే నిర్ణయించాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు సోమవారం నాడు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.

ఉద్యోగ సంఘాల కార్యాచరణ వివరాలు..

.ఈ నెల 25న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు
.ఈ నెల 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు విజ్ఞాపన పత్రాల అందజేత
.ఈ నెల 27 నుంచి 30 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు
.ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ
.ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/