బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం..గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి

ఖమ్మంలో జిల్లాలో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్ కార్యకర్తలు బాణాసంచా పేల్చగా..ఆ పక్కనే ఉన్న గుడిసె ఫై బాణాసంచా పడి అంటుకుంది. దీంతో గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటన లో ఒకరు మృతి చెందగా , పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బిఆర్ఎస్ పార్టీ ప్రతి డివిజన్ లో , నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళన పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలకు కార్య కర్తలు , ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతూ సక్సెస్ చేస్తున్నారు. బుధువారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు లో ఏర్పటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో విషాదం చుటుచేసుకుంది. సమ్మేళనంలో కాల్చిన బాణాసంచా ఎగిరిపడి ఓ గుడిసెకు నిప్పు అంటుకుంది. అనంతరం మంటలు చెలరేగి.. గుడిసెలోని గ్యాస్ సిలిండర్ బాంబు తరహాలో పేలింది. ఈ ఘరో ప్రమాదంలో ఒకరి మృతి చెందగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతదేహం చెల్లాచెదురుగా పడిపోయింది. కాళ్లు తెగి ఒకరు, నెత్తురు వరద కారుతూ భీతావాహం నెలకొంది.. చిధ్రమైన శరీరభాగాలతో కారేపల్లి భీతావహంగా మారింది. ఎమ్మెల్యే రాములూనాయక్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.