ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ నివాసంలో ఈడీ దాడులు

AAP MLA Amanatullah Khan Raided In Money-Laundering Case

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహిస్తున్నది. ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌గా ఉన్న సమయంలో జరిగిన అక్రమ నియామకాలకు సంబంధించి సీబీఐ, ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే కోణంలో విచారిస్తున్నది. ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నది.

ఓఖ్లా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన అమానతుల్లా ఖాన్‌.. గతంలో ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 32 మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.