బంతి ఉంటే బుమ్రా చాలా ప్రమాదకరం
బుమ్రా విఫలమయినా విలియమ్సన్ పొగడడం విశేషం

మౌంట్ మాంగనుయ్: చేతిలో బంతి ఉంటే భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంతో ప్రమాదకరం. అయితే బుమ్రా బౌలింగ్‌లో కాస్త పదును పెరగాలి అని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ అయిదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో సిరీస్‌ను 0-3తో కోల్పోయి భారత్ వైట్‌వాష్ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక ఈ సిరీస్‌లో బుమ్రా పూర్తిగా విఫలమయినా.. విలియమ్సన్ పొగడడం విశేషం. కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ… ‘అన్ని ఫార్మాట్లో జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్. ఈ విషయం మన అందరికీ తెలుసు. ప్రస్తుతం అతడు బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. చేతిలో బంతి ఉంటే బుమ్రా ఎంతో ప్రమాదకరం. అయితే.. అతడి బౌలింగ్‌లో కాస్త పదును పెరగాలి. అతడి విషయంలో టీమిండియాకు ఎలాంటి అనుమానాలు వద్దు. ఏ సమయంలోనైనా పుంజుకోగలడు’ అని విలియమ్సన్ తెలిపాడు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/