షెఫాలీ వర్మకు షాక్‌.. అగ్రస్థానం కోల్పోయింది

Shafali Verma
Shafali Verma

దుబాయ్: ఐసిసి టీ20 మహిళల ర్యాంకింగ్స్‌లో షెఫాలీ వర్మ తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. తాజాగా సోమవారం విడుదలైన ర్యాంకింగ్స్‌లో రెండు ర్యాంకులు దిగజారి మూడో స్థానంలోకి పడిపోయింది. దీంతో షెఫాలీ అగ్రస్థానం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది. అయితే టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన షెఫాలీ గత బుధవారమే నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించింది. కానీ ఫైనల్లో షెఫాలీ విఫలం కావడంతో ర్యాంక్‌ను దెబ్బతీసింది. 744 పాయింట్లతో ఆమె ఒకటి నుంచి మూడో స్థానానికి పడిపోయింది. అదే సమయంలో ఫైనల్లో అధిక స్కోరును చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ బెత్‌ మూనీ 762 పాయింట్లతో మూడు నుంచి ఒకటో స్థానంలోకి దూసుకొచ్చింది. మొత్తం ఆరు ఇన్నింగ్స్‌ల్లో 259 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా మూనీ తన కెరీర్‌‌లో తొలిసారి నంబర్‌‌ వన్‌ ర్యాంక్‌ అందుకుంది. న్యూజిలాండ్‌ క్రికెటర్ సుజీ బేట్స్ (750) రెండో ర్యాంక్‌లో మార్పులేదు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/