కోర్టులో కన్నీటిపర్యంతమైన నిర్భయ తల్లి

హంతకులకు డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని వేడుకుంటూ కంటతడి

Nirbhaya mother asha devi
Nirbhaya mother asha devi

న్యూఢిల్లీ: నిర్భయ నిందితుల కేసుపై ఈ రోజు పటియాలా కోర్టులో విచారణ జరిగింది. అయితే నిర్భయ హంతకుల ఉరితీత విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆమె తల్లి ఆశాదేవి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పటియాలా కోర్టు హాల్లో విచారణ సందర్భంగా భోరున విలపించారు. హంతకులకు వెంటనే డెత్ వారెంట్లు జారీచేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని కంటతడి పెట్టారు. తాను కూడా మనిషినేనని, తమ హక్కుల సంగతి ఏమిటని ఆమె ప్రశ్నించారు. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లకు పైగా అయిపోయిందని ఆమె అన్నారు. ఈ కేసులో దోషులైన పవన్, ముఖేశ్, అక్షయ్, వినయ్ ల ఉరితీతకు కొత్త డెత్ వారెంట్లు ఇవ్వాలంటూ నిర్భయ తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/