బిగ్ బాస్ 5 : ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్‌లో అపశృతి

బిగ్ బాస్ 5 : ‘టికెట్ టు ఫినాలే' టాస్క్‌లో అపశృతి

తెలుగు సీజన్ బిగ్ బాస్ 5 ఫైనల్ స్టేజ్ కి వెళ్ళింది. ఇంకో మూడు వారలైతే పూర్తి అవుతుంది. ఈ తరుణంలో టాప్ 3 లో ఎవరు ఉంటారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం హౌస్ లో ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్‌ జరుగుతుంది. ఈ టాస్క్ ప్రకారం ఇంటి సభ్యులు ఐస్ బకెట్ టబ్‌లో నిల్చోవాల్సి ఉంటుంది. అలాగే, వాళ్ల పేరిట రెండు బకెట్లు పెట్టారు. పైన ఉన్న దాని నిండా బాల్స్, కింద ఉన్నది ఖాళీగా ఉంచారు. గేమ్‌ ఆడేప్పుడు కంటెస్టెంట్లు ఐస్ నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ల బాల్స్ కొట్టేయొచ్చు.. ఇలా ఈ రౌండ్ చివరికి ఎవరి దగ్గర ఎక్కువ బాల్స్ ప్రకారం మార్కులు ఇస్తారు. ఈ గేమ్ సరదాగా సరదాగా సాగుతుంది.

ఈ గేమ్ ఆడుతోన్న సమయంలో షణ్ముఖ్, శ్రీరామ చంద్ర, ప్రియాంక సింగ్, సిరి హన్మంత్‌లు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది. ఈ టాస్క్ సమయంలో వాళ్లు స్పర్శను కోల్పోయారట. దీంతో బిగ్ బాస్ వెంటనే టాస్కును ఆపేసి ఆ నలుగురు కంటెస్టెంట్లను మెడికల్ రూమ్‌లోకి పంపాడని సమాచారం. అక్కడ పరీక్షలు చేసిన తర్వాత ప్రమాదం లేదని వైద్యులు చెప్పారట. దీంతో తర్వాత వాళ్లంతా టాస్కులను కంటిన్యూ చేశారని అంటున్నారు. మరి ఇది ఎపిసోడ్ లో చూపిస్తారో లేదో చూడాలి.